: 'నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్' షూటింగ్ లో బాబు పాల్గొన్నారు: జ్యోతుల నెహ్రూ
పుష్కరాల నిర్వహణ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి తహతహలాడారని వైకాపా నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. అందుకే, వీఐపీ ఘాట్ కానప్పటికీ కోటగుమ్మం ఘాట్ లో చంద్రబాబు పూజలు నిర్వహించారని, అదే సమయంలో పబ్లిసిటీ కోసం జనాన్ని ఆ ఘాట్ వైపు తరలించారని మండిపడ్డారు. పుష్కరాలపై ప్రత్యేక కథనాన్ని చిత్రీకరిస్తున్న 'నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్' షూటింగ్ లో చంద్రబాబు పాల్గొన్నారని... దీనికోసమే భక్తులను గంటల సేపు వేచి ఉండేలా చేశారని విమర్శించారు.