: ర్యాగింగ్ మరణంలో మరో కోణం... తన బాయ్ ఫ్రెండ్స్ కోసం రిషికేశ్వరిని సినిమాకు తీసుకెళ్లిన అనిష!


సీనియర్ల ర్యాగింగును తట్టుకోలేక రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హాస్టల్ గదిలో ఉండే సహ విద్యార్థిని అనిష చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, దగ్గరగా ఉండాలి అని రిషికేశ్వరిని బెదిరించేదని తెలుస్తోంది. ఆదివారం నాడు అనిష వ్యవహారం మరీ శృతిమించింది. తన ఫ్రెండ్స్ కోసం రిషికేశ్వరిని, బలవంతపెట్టి బాహుబలి చిత్రానికి తీసుకెళ్లింది. అక్కడ అనిష స్నేహితులు శ్రీనివాస్, చరణ్ లు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. సినిమా మధ్యలోనే బయటకు వచ్చిన రిషికేశ్వరి, తన పిన్ని ఇంటికి వెళ్లి జరిగింది వివరించగా, 'హాస్టళ్లలో ర్యాగింగ్ సాధారణమే, సర్దుకుపోవాలని' సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. రిషికేశ్వరి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News