: సరిహద్దులు చెరిపిన మానవత... పాకిస్థానీ బాలుడికి హైదరాబాదీ గుండె


ఓ బాలుడి ప్రాణాలను నిలపడంలో మానవత్వం సరిహద్దులు దాటింది. హైదరాబాదులో బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారి అవయవదానం పాకిస్థానీ బాలుడి ప్రాణాలు నిలిపింది. వివరాల్లోకి వెళితే, పాక్ లోని వంశావళి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. ఆ ఇంట ఓ బాలుడి గుండె సాధారణ స్థితి కంటే, పెద్దదిగా ఉండడంతో సమస్యలు తలెత్తాయి. గుండెను మార్చితేగాని ప్రాణాలు దక్కవని వైద్యులు చెప్పడంతో, అవయవదాతల కోసం చేసిన అన్వేషణ ఫలించింది. హైదరాబాదులో వైష్ణవ్ అనే బాలుడు రోడ్డు ప్రమాదానికి గురై మెదడు పనిచేయని స్థితికి రాగా, అతని తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. అధికారులు సైతం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడంతో వైష్ణవ్ గుండె భద్రంగా చెన్నై చేరింది. అక్కడి ఫ్రంటర్ లైఫ్ లైన్ ఆసుపత్రి వైద్యులు, అప్పటికే ఆపరేషన్ టేబుల్ పై ఉన్న పాకిస్థాన్ బాలుడికి ఈ గుండెను విజయవంతంగా అమర్చారు. ఈ ఘటన హద్దుల్లేని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

  • Loading...

More Telugu News