: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో తుపాకితో హల్ చల్ చేసిన వ్యక్తి!
తెలంగాణలోని ప్రధాన నగరం వరంగల్ లోని ప్రభుత్వ ఆస్పత్రి ఎంజీఎంలో నేటి ఉదయం తుపాకి కలకలం రేగింది. తుపాకి చేతబట్టి అనుమానాస్పదంగా ఆస్పత్రిలో సంచరిస్తున్న వ్యక్తిని చూసిన ఆస్పత్రిలోని రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి చేతిలోని తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.