: మూడో రోజుకు చేరిన పుష్కరాలు... గోదావరి తీరానికి పోటెత్తిన భక్తజనం
పవిత్ర గోదావరి పుష్కరాలు నేడు మూడో రోజుకు చేరుకున్నాయి. తొలి రెండు రోజుల మాదిరిగానే మూడో రోజు కూడా తెల్లవారుజాము నుంచే గోదావరి తీరంలో భక్తుల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లకు తరలివస్తున్న భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రధాన పుష్కర ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చింది. ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, అంతర్వేదిలతో పాటు తెలంగాణలోని భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల సందడి నెలకొంది.