: రేపు గవర్నర్ నరసింహన్ ను కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు
టీఆర్ఎస్ ఎంపీలు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. హైకోర్టు విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వారు గవర్నర్ ను కోరనున్నారు. కాగా, గతంలో టీఆర్ఎస్ ఎంపీలంతా హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా రాష్ట్రంలో లాంఛనాలు పూర్తి కావాలని, అనంతరం విభజన జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రాథమిక అంశాలన్నీ పూర్తికాగానే కేంద్రం హైకోర్టు విభజన పూర్తి చేస్తుందని తెలిపారు. దీంతో, గవర్నర్ ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో రేపు గవర్నర్ ను కలిసి హైకోర్టు విభజనపై డిమాండ్ చేయనున్నారు.