: సినిమాల్లో ఆ సీన్లు కనిపించకూడదు: యూపీ రవాణా శాఖ
బైక్ ఫీట్లు, బైక్ ఛేజింగులు, అమ్మాయిలను ఎక్కించుకుని ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా షికార్లు చేయడం నేటి సినిమాల్లో సర్వ సాధారణంగా కనిపించే దృశ్యాలు. వీటికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెక్ పెట్టనుంది. సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు ఉండకూడదని ఆదేశించింది. సినిమాలను చూసి యువత ప్రభావితమవుతున్నారని భావించిన యూపీ రవాణా శాఖ, హీరోల స్పూర్తితో చేసే ఫీట్లను ఆపేందుకు పూనుకుంది. సినిమాల్లో అభిమాన నటులు చేసే ఫీట్లు చేస్తూ యువకులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని, యువత ప్రభావితమయ్యే సీన్లను సినిమాల్లోంచి తొలగించాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సినిమాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సీన్లు తొలగించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని యూపీ రవాణా శాఖ స్పష్టం చేసింది.