: నీతి ఆయోగ్ సమావేశంలో మోదీని ప్రశ్నించిన కేజ్రీవాల్


నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీలో పెత్తనం విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ మోదీని ప్రశ్నించేందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ సమావేశంలో భూసేకరణ బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీ పరిపాలనలో కేంద్రం జోక్యాన్ని ఆయన ఖండించారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజానికి కేంద్రం తూట్లు పొడుస్తోందని ఆయన ఆరోపించారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం గురించి చర్చించేందుకు మరోసారి సమావేశమవ్వాలని కేజ్రీవాల్ ప్రధానికి సూచించారు.

  • Loading...

More Telugu News