: 21వ శతాబ్దం భారత్ దే!: ఐబీఎం సీఈవో


21వ శతాబ్దం భారతీయులదేనని ఐబీఎం సీఈవో వర్జీనియా రొమెటీ పేర్కొన్నారు. భారత్ లో పర్యటిస్తున్న ఆమె, టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రశంసించారు. కొత్తగా వస్తున్న కంపెనీలు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని, సేవలు అందించేందుకు ఉత్సాహం చూపుతున్నాయని అన్నారు. వినియోగదారుల మన్ననలు అందుకునేందుకు భారతీయ కంపెనీలు సరికొత్త ప్రణాళికలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ఆమె పేర్కొన్నారు. టెక్నాలజీని నమ్ముకున్న ఏ ఆర్థిక వ్యవస్థ అయినా విజయం సాధిస్తుందని ఆమె తెలిపారు. భారత్ లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయని ఆమె చెప్పారు. భారతీయులు వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకుని, వాటిని జాగ్రత్తగా మలచుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. శాస్త్రసాంకేతిక రంగంలో భారతీయులు నైపుణ్యం సంపాదించుకున్నారని ఆమె అన్నారు. పలు వాస్తవాలు పరిగణనలోకి తీసుకుని 21వ శతాబ్దం భారత్ దేనని స్పష్టంగా చెప్పగలనని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News