: రియల్ లైఫ్ గజనీ... అతని జ్ఞాపకశక్తి కేవలం 90 నిమిషాలే!


సూపర్ హిట్ అయిన గజనీ సినిమాలోని పాత్ర రియల్ లైఫ్ లో కూడా ఉంది. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం! లండన్ లో ఉండే ఓ వ్యక్తి సేమ్ టు సేమ్ ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. అతని జ్ఞాపకశక్తి కేవలం 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే... గంటన్నర సేపు అన్నమాట. కొన్నేళ్ల క్రితం సదరు వ్యక్తి పంటి నొప్పి ఉందని ఓ డెంటిస్ట్ వద్దకు వెళ్లాడు. రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేసేందుకు అతనికి మత్తు మందు ఇచ్చారు. అంతే... అప్పట్నుంచి అతను గజనీగా మారిపోయాడు. ప్రతిరోజు ఆ వ్యక్తికి డాక్టర్ దగ్గరకు వెళ్లిన సంగతే గుర్తుంటుంది. దీంతో, ఉదయం నిద్రలేవగానే డెంటిస్ట్ దగ్గరకు వెళ్లడానికి అతను రెడీ అవుతాడు. అయితే, అతనికి తన పేరు, ఇతర వివరాలు మాత్రం గుర్తున్నాయట.

  • Loading...

More Telugu News