: మడోనాపై సోషల్ మీడియాలో విమర్శలు
పాప్ సింగర్ మడోనాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఇన్ స్టా గ్రాంలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోనే! 'తల్లి పట్ల పిల్లలు చూపిస్తున్న ప్రేమ' అని పేర్కొన్న ఆ ఫోటోలో మడోనా నేలపై పడుకుని ఉండగా, ఆమె ఇద్దరు పిల్లలు నవ్వుతూ ఆమె కాళ్లకు మర్దన చేస్తున్నట్టు ఉంటుంది. వారిద్దరూ మడోనా దత్తత తీసుకున్న తొమ్మిదేళ్ల నల్లజాతి పిల్లలు డేవిడ్ రిచి, మెర్సీ జేమ్స్. ఈ ఫోటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిద్దరూ నల్లజాతీయులు అయినందునే మడోనా వారిని బానిసలుగా చూస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. డేవిడ్ రిచి, మెర్సీ జేమ్స్ కాకుండా మడోనాకు 15 ఏళ్ల సొంత కుమారుడు రోకో ఉన్నాడు.