: 'నీతిఆయోగ్' కు 'అమ్మ' డుమ్మా... హాజరైన వీర విధేయుడు


ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలో 'నీతిఆయోగ్' సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే, 14 రాష్ట్రాల సీఎంలు ఈ కీలక భేటీకి గైర్హాజరయ్యారు. డుమ్మా కొట్టిన వారిలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు. ఇతర కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని, అందుకే రాలేకపోతున్నానని ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇక, "అమ్మ'కు బదులుగా ఆమెకు వీర విధేయుడిగా పేరుగాంచిన పన్నీర్ సెల్వం సమావేశానికి హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష పడడంతో నమ్మినబంటు అయిన పన్నీర్ సెల్వంకే జయ సీఎం పగ్గాలు అప్పగించారు. అనంతరం, సీఎం కుర్చీలో కూర్చోకుండా, జయ ఫొటోతోనే పన్నీర్ సెల్వం పాలన సాగించడం విశేషం.

  • Loading...

More Telugu News