: మెమన్ విషయంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం: ఫడ్నవీస్


ముంబయి పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ కు ఈ నెల 30న మరణశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెమన్ నాగ్ పూర్ జైలులో ఉన్నాడు. ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. 1993 ముంబయి పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ కు మరణశిక్ష విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర సర్కారు పాటిస్తుందని తెలిపారు. "సుప్రీం కోర్టు దీనిపై ఓ నిర్ణయం వెలువరించింది. కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే మహారాష్ట్ర సర్కారు చర్యలు ఉంటాయి. తగిన సమయం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు.

  • Loading...

More Telugu News