: డిగ్గీరాజాతో ‘తెలుగు‘ నేతల భేటీ...రాహుల్ పర్యటన, జంపింగ్ పైనే ప్రధాన చర్చ


కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లిన తెలుగు రాష్ట్రాల నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. అధిష్ఠానం ఆదేశాలతో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీలు నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ విమానం దిగగానే నేరుగా డిగ్గీరాజా వద్దకెళ్లారు. దాదాపు గంటకు పైగా కొనసాగిన సమావేశంలో ఏపీలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన, తెలంగాణలో పార్టీ నేతల జంపింగ్ లపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News