: మృత్యువు ముంగిట ఓ నేరస్తుడి అసాధారణ సందేశం


మరణశిక్ష పడిన నేరస్తుల్లో అత్యధికులు చావు ముంగిట ఎంతో ఆందోళనగా కనిపించడం సహజం. కొందరు మాత్రం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. డేవిడ్ జింక్ అనే నేరస్తుడు మాత్రం అసాధారణ రీతిలో ఓ సందేశం వెలువరించాడు. అమెరికాలోని మిస్సౌరిలో మంగళవారం రాత్రి అతడికి విషపు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. మరణశిక్ష పడిన ఇతర నేరస్తులకు తన సందేశం ఉపయుక్తంగా ఉంటుందని అతడు భావించాడు. తన ఫైనల్ స్టేట్ మెంట్ లో "మీకోసం ఎదురుచూస్తున్న విధిని గౌరవించండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే కదా. చాలామంది కంటే మనకు సులువుగా మరణం లభిస్తుంది. వీళ్లు ఇంకా బతికున్నారేంట్రా అని ప్రజలు మనల్ని తూలనాడకముందే చనిపోతున్నందుకు సంతోషిద్దాం. మరణశిక్ష మనకు నిజమైన స్వేచ్ఛ... ఆ దిశగా దాన్ని స్వాగతించండి, మృత్యువును హత్తుకోండి" అని పిలుపునిచ్చాడు. 55 ఏళ్ల జింక్ 2001లో అమందా మోర్టన్ (19) టీనేజ్ అమ్మాయిని అపహరించి, లైంగిక దాడికి పాల్పడి, ఆపై దారుణంగా హత్య చేశాడు. ఆమెను శ్మశానంలో ఓ చెట్టుకు కట్టేసి, మెడ విరిచేశాడు. ఆపై వెన్నెముకను ముక్కలు చేశాడు. అతడి కిరాతకాన్ని మాటల్లో వర్ణించలేమని అక్కడి అధికారులు పేర్కొన్నారంటే క్రైమ్ సీన్ ఎంత భయానకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News