: జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ప్రత్తిపాటి


వైకాపా అధినేత జగన్ పై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. దురదృష్టవశాత్తు జరిగిన ఒక సంఘటనను ఆసరాగా చేసుకుని జగన్ శవరాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అపశృతి దొర్లి భక్తులు ఇబ్బందుల్లో పడినప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన విపక్షాలు... రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. వీలైతే భక్తులను ఓదార్చాలి కానీ... అనవసర విమర్శలు చేయడం సరికాదని అన్నారు. చిరంజీవి, రఘువీరా, బొత్సలాంటి నేతలు కూడా శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా ఎంతో చేసినప్పటికీ, దురదృష్టవశాత్తు ఇది జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News