: ములాయంపై పోరు కొనసాగిస్తానంటున్న ఐపీఎస్ అధికారి
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తనను ఫోన్ లో బెదిరించారంటూ ఫిర్యాదు చేసి యూపీలో కలకలం రేపిన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ పై సస్పెన్షన్ వేటు పడడం తెలిసిందే. సస్పెన్షన్ నిర్ణయంపై ఠాకూర్ స్పందిస్తూ... ములాయంపై తన పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన వద్ద ఉన్న ఆడియో టేపులను పోలీసులకు అందిస్తానని, వారెలాంటి చర్య తీసుకుంటారో చూస్తానని తెలిపారు. ములాయంపై ఠాకూర్ ఫిర్యాదు అనంతరం, ఓ మహిళ తెరపైకి వచ్చి ఠాకూర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడం తెలిసిందే. అటుపై, సోమవారం రాత్రి ఠాకూర్ ను ఐజీ విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు యూపీ సర్కారు ప్రకటించింది.