: ఇరాన్ పై క్లింటన్ సతీమణికి అంత కోపం ఎందుకో...!


ఏళ్ల తరబడి అగ్రరాజ్యాలతో వైరం కొనసాగించిన ఇరాన్ తాజాగా అణు ఒప్పందం కుదుర్చుకుని శాంతి దిశగా అడుగు వేసింది. అటు, అమెరికా సహా అగ్రరాజ్యాలు ఈ పరిణామంపై సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ మాత్రం ఈ ఒప్పందంపై భిన్నంగా స్పందించారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఇరాన్ ఎన్నటికీ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై క్లింటన్ సతీమణితో పాటు యూఎస్ కాంగ్రెస్, పలు అమెరికా మిత్రదేశాలు కూడా విమర్శలు చేయడం తెలిసిందే. కాస్త ఆలస్యంగానైనా ఇరాన్ కు అణ్వస్త్రం అందించే విధంగా ఈ ఒప్పందం ఉందని విమర్శకులంటున్నారు. తాను అధికారంలోకి వస్తే మాత్రం ఇరాన్ ను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని ప్రతిజ్ఞ చేశారు. "ఇరాన్ కు పంపే సందేశం గట్టిగానూ, స్పష్టంగానూ ఉండాలి. అణు కార్యక్రమాన్ని ఎన్నటికీ అనుమతించబోమని కఠినంగా చెప్పాలి. ఈ ఒప్పంద కాల వ్యవధిలోనే కాదు, ఎన్నటికీ అణ్వస్త్రం సమకూర్చుకోవడం కుదరదని తెలియజేయాలి" అని అన్నారు.

  • Loading...

More Telugu News