: ఇండియన్ బర్గర్ కు ఫిదా అయిన అమెరికన్ ప్రెసిడెంట్!


బర్గర్, పిజ్జాలకు అమెరికా పెట్టింది పేరు. అంతేకాదు, వాటికి జీవం పోసింది కూడా పాశ్చాత్య దేశాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికానే. అలాంటి దేశానికే అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా, ఇండియన్ బర్గర్ కు ఫిదా అయిపోయారు. ఒబామా సతీమణి మిషెల్ కూడా సదరు ఇండియన్ బర్గర్ పై తన ఇష్టాన్ని దాచుకోలేకపోయారు. అసలు విషయానికొస్తే... ‘కిడ్స్ స్టేట్ డిన్నర్’ పేరిట అమెరికా అధ్యక్ష భవనంలో నిన్న ఏర్పాటైన డిన్నర్ లో చికాగోకు చెందిన తొమ్మిదేళ్ల భారత సంతతి చిన్నారి శ్రేయా పటేల్ కూడా పాల్గొంది. తన తల్లి, అమ్మమ్మల ద్వారా తొమ్మిదేళ్ల వయసుకే ‘ఇండియన్ మార్క్ బర్గర్’ తయారీలో ఆ బాలిక ఆరితేరింది. ఆ బాలిక తయారు చేసిన బర్గర్ ను ఒబామా ఆసక్తిగా రుచిచూశారు. అల్లం, జీలకర్ర, గరంమసాలా తదితర భారతీయ దినుసులతో ఆ బాలిక తయారు చేసిన క్వినో బర్గర్ పై మిషెల్ కూడా ప్రశంసలు కురిపించారు. అన్ని రకాల పళ్లు, కూరగాయలతో శ్రేయా వంటకాలను అద్భుతంగా తయారు చేసిందని మిషెల్ మెచ్చుకున్నారట.

  • Loading...

More Telugu News