: ‘సంగీత సామ్రాట్’కు ఒక్క ‘పద్మ’ కూడా ఇవ్వలేకపోయారు...కేంద్రంపై ‘అమ్మ’ విమర్శ!


వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పద్మ పురస్కారాల విషయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కు తగిన ప్రాధాన్యం దక్కలేదని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధి కారణంగా చికిత్స పొందుతూ విశ్వనాథన్ నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విశ్వనాథన్ మరణంపై సంతాపం తెలిపిన జయలలిత, ఆయనకు పద్మ పురస్కారం దక్కని అంశాన్ని ప్రస్తావించారు. ‘‘1200 చిత్రాలకుపైగా సంగీతం అందించిన విశ్వనాథన్ కు ఒక్క పద్మ పురస్కారం కూడా అందించేందుకు మీకు చేతులు రాలేదా?’’ అంటూ కేంద్రం వైఖరిపై ఆమె నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News