: గోదావరి పుష్కర స్నానం చేసిన జగన్
వైకాపా అధినేత జగన్ ఈరోజు పవిత్ర గోదావరిలో పుష్కర స్నానమాచరించారు. రాజమండ్రికి అవతల ఒడ్డున ఉన్న కొవ్వూరులోని గోష్పాద ఘాట్ లో పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఆయన పుష్కర స్నానం చేశారు. కాపేసట్లో తన తండ్రి, దివంగత రాజశేఖర రెడ్డికి జగన్ పిండ ప్రదానం చేసే అవకాశం ఉంది. తమ అధినేత పుష్కర స్నానానికి రావడంతో, వైకాపా నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో గోష్పాద ఘాట్ కు చేరుకున్నారు.