: రేవంత్ రెడ్డి స్థలం ప్రహరీని కూల్చేందుకు యత్నించిన టీఆర్ఎస్ నేత
టీడీపీ నేత రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ప్రహరీ గోడను కూల్చేందుకు ఓ టీఆర్ఎస్ నేత యత్నించడం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా గోపన్నపల్లిలో రేవంత్ రెడ్డికి స్థలం ఉంది. టీఆర్ఎస్ నేత శంకర్ గౌడ్ తన అనుచరులతో కలిసి ఆ స్థలం ప్రహరీ గోడను కూల్చేందుకు ప్రయత్నించారు. దీనిపై రేవంత్ రెడ్డి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు శంకర్ గౌడ్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. శంకర్ గౌడ్ గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. టీఆర్ఎస్ సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని రేవంత్ సోదరుడు పోలీసులను కోరారు.