: మమతా బెనర్జీపై దాడి కేసులో ఐదుగురు అరెస్టు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి కేసులో ఐదుగురు ఎస్ఎఫ్ఐ విద్యార్ధులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రితాబ్రాతా బందోపాధ్యాయ ఉన్నారు. వీరిని రేపు ఢిల్లీ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.
కొన్నిరోజుల కిందట ముఖ్యమంత్రి మమతా, బెంగాల్ ఆర్ధికమంత్రి అమిత్ మిత్రాతో కలిసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి వచ్చారు. ప్లానింగ్ కమిషన్ కార్యాలయం లోపలికి వెళ్తున్న వీరిపై అక్కడే ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు దాడిచేశారు. మంత్రి అమిత్ మిత్రా చొక్కా చింపివేశారు. ఈ ఘటనకు నిర్ఘాంతపోయిన మమతా తీవ్ర ఆగ్రహానికి లోనైన సంగతి తెలిసిందే.