: నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం!


ఫిక్సింగ్ వ్యవహారంలో ఆర్.ఎం.లోథా కమిటీ చెన్నై సూపర్ కింగ్స్ ను రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించిన సంగతి తెలిసిందే. లోథా కమిటీ నిర్ణయాన్ని చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. లోథా కమిటీ నిర్ణయంపై చర్చించామని, ఊరట కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించామని ఇండియా సిమెంట్స్ వర్గాలు తెలిపాయి. లోథా కమిటీ చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ పైనా నిషేధం విధించింది. నిషేధంపై రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వర్గాల స్పందన తెలియరాలేదు.

  • Loading...

More Telugu News