: చంద్రబాబు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇలా జరగడం దురదృష్టకరం: ఎంపీ రామ్మోహన్ నాయుడు


ఎలాంటి అవాంతరాలు కలగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలను ఘనంగా నిర్వహించే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో ఏర్పాట్లు చేసినప్పటికీ... 27 మంది మృత్యువాత పడటం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. చనిపోయిన 27 మందిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 10 మంది ఉండటం మరింత బాధాకరమని తెలిపారు. వీరందరినీ రాజమండ్రి నుంచి జిల్లాకు పంపే పనిలో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారని చెప్పారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News