: రాజమండ్రి ఘటన బాధాకరం: టీఆర్ఎస్ ఎంపీ కవిత
రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్ లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలను కోల్పోవడం పట్ల టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన పుష్కరాల సందర్భంగా ఇలాంటి ఘటన జరగడం ఎంతో బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హడావుడి లేకుండా భక్తులంతా నెమ్మదిగా వెళ్లాలని ఆమె సూచించారు.