: భద్రాచలంలో పెరిగిన భక్తుల రద్దీ... రాములోరి దర్శనానికి ఆరు గంటలు


గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచలానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. పుష్కర స్నానం చేశాక రాములోరిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. దాంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి ఏకంగా 6 గంటల సమయం పడుతోంది. దీంతో రద్దీకి అనుగుణంగా భక్తులు దర్శనానికి సిద్ధమవ్వాలని ఐజీ నవీన్ చంద్ సూచించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ భద్రాచలం, కాళేశ్వరం బయలుదేరి వెళ్లారు. ఈ రెండు చోట్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో సౌకర్యాలు కల్పించాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. పుష్కర ఘాట్ల వద్ద క్యూలైన్ కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని, స్నానాలకు లోతు వున్న చోటకు వెళ్లకుండా చూడాలని, అన్ని ప్రాంతాల్లో పడవలు, గజ ఈతగాళ్లను రెడీగా ఉంచాలని చెప్పారు.

  • Loading...

More Telugu News