: విశ్వనాథన్ మృతిపట్ల మోదీ, జయలలిత సంతాపం


ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సంగీత ప్రియులకు తీరని లోటని, ఆయన స్వరపరిచిన చలనచిత్ర గీతాలు అందరినీ ఆకట్టుకునేవని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. విశ్వనాథన్ కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మోదీతో పాటు తమిళనాడు సీఎం జయలలిత కూడా విశ్వనాథన్ మరణం పట్ల సంతాపం తెలిపారు. మెలోడీ పాటలకు ఆయనను రాజుగా అభివర్ణించారు. ఒక్క పద్మ పురస్కారం కూడా ఆయనకు రాకపోవడం విచారకరమని జయ పేర్కొన్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ ఈ ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News