: రాజమండ్రి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించాలనిపిస్తోంది, కానీ...!: పవన్ కల్యాణ్
రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజమండ్రి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించాలనిపిస్తోందని తెలిపారు. అయితే, సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని ఆ ఆలోచన విరమించుకున్నట్టు వివరించారు. సహాయ చర్యలకు తోడ్పాటు అందించాలని జనసేన కార్యకర్తలకు పవన్ సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.