: కుంభమేళాలోనూ తొక్కిసలాట... ఇద్దరు మృతి
ఏపీ గోదావరి పుష్కర ఘాట్ లో చోటు చేసుకున్న దుర్ఘటనే కుంభమేళాలో కూడా చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ రోజు ప్రారంభమైన కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు చనిపోయినట్టు తెలిసింది. మొదటిరోజు కావడంతో రద్దీ ఎక్కువగా ఉండటంతో కుంభమేళా వద్ద తొక్కిసలాట జరిగింది. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపు చేస్తున్నాయి.