: రాజమండ్రి ఘటనపై సోనియా విచారం... బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన


గోదావరి పుష్కరాల్లో భాగంగా రాజమండ్రిలో కోటగుమ్మం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై పార్టీ నేతల నుంచి సమాచారం అందుకున్న ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆమె, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

  • Loading...

More Telugu News