: చంద్రబాబు రాజీనామా చేయాలి: చిరంజీవి డిమాండ్


రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడటంపై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిరంజీవి అన్నారు. పుష్కరాలకు విపరీతమైన ప్రచారం చేశారని, లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనాలు కూడా వేశారని, కానీ, దానికి తగ్గ ఏర్పాట్లు చేయడంలో మాత్రం చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. వందల కోట్లు ఖర్చు చేసినప్పటకీ, ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు అన్నీ తానే అయి, వ్యక్తిగతంగా పర్యవేక్షించినప్పటికీ ఇది జరిగిందని అన్నారు. చంద్రబాబు తనను తాను గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకుంటారని, అదంతా పబ్లిసిటీ కోసమే అనేది ఈ ఘటనతో తెలిసిపోయిందని చెప్పారు. ఘాట్లలోకి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది బయటకు వెళ్తున్నారు? అనేని కూడా సరిగా అంచనా వేయకపోవడం దారుణమని అన్నారు. ఇంత జరిగినా, చంద్రబాబు రాజీనామా చేస్తారని తాను భావించడం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News