: ‘ఉన్మాది’ దాడి బాధితుల మృతి... నిందితుడు బాధితురాలి క్లాస్ మేటేనట!


హైదరాబాదు చైతన్యపురి పరిధిలోని కొత్తపేట (మోహన్ నగర్)లో కొద్దిసేపటి క్రితం జరిగిన ఉన్మాది దాడి బాధిత యువతులిద్దరూ మృతి చెందారు. బాధితులిద్దరినీ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యామిని సరస్వతి, శ్రీలేఖలుగా పోలీసులు గుర్తించారు. షాద్ నగర్ కు చెందిన కృష్ణారెడ్డి, హైమావతి దంపతుల పిల్లలైన యామిని ఇప్పటికే ఇంజినీరింగ్ పూర్తి చేయగా, శ్రీలేఖ గీతం కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతోందట. శ్రీలేఖ క్లాస్ మేట్ అమిత్ సింగే ఈ అక్కాచెల్లెళ్లిద్దరిపై దాడికి దిగాడని పోలీసులు నిర్ధారించారు. రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని శ్రీలేఖ వెంటబడ్డ అమిత్ సింగ్, నేటి ఉదయం మోహన్ నగర్ లోని బాధితుల ఇంటికి వచ్చి శ్రీలేఖతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన యామినిపైనా అమిత్ విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన వారిద్దరినీ సమీపంలోని ఒమ్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. దాడి సమయంలో బాధితుల తల్లిదండ్రులు ఇంటిలో లేరని సమాచారం. దీనినే అవకాశంగా తీసుకుని అమిత్ దాడికి తెగబడ్డాడని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News