: 12 రోజులు ఉన్నాయి... తొలి రోజే తొందర వద్దు: భక్తులకు సూచించిన వేద పండితులు
రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలే అధికంగా ఉండటం కలచివేస్తోంది. దీంతో, భక్తులకు వేద పండితులు పలు సూచనలు చేశారు. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయని... ఈ 12 రోజుల్లో ఏ రోజు స్నానం చేసినా ఒకటే ఫలితం ఉంటుందని వారు చెప్పారు. తొలి రోజే పుష్కర స్నానం ఆచరించాలన్న ఆతృత వద్దని సూచించారు. ఒకే ఘాట్ కు వేలాది మంది ఒకేసారి వెళ్లాలని ప్రయత్నించరాదని... ఎన్నో ఘాట్ లు ఉన్నాయి కాబట్టి, రద్దీ తక్కువ ఉన్న ఘాట్ లకు వెళ్లడం మంచిదని తెలిపారు.