: 17కు చేరిన మృతుల సంఖ్య... రాజమండ్రిలో అలముకున్న విషాద ఛాయలు
పవిత్ర గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తోపులాట విషాదాన్ని మిగిల్చింది. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ కు ఒక్కసారిగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా, గోదావరిలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న వారు బయటకు రాకుండానే, బయట ఉన్నవారు లోపలకు నెట్టుకుంటూ వెళ్లడంతో, జరిగిన తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది చనిపోగా... మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా, తొక్కిసలాటకు తావులేకుండా, భక్తులంతా క్యూలో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.