: ఇది చాలా దురదృష్టకర ఘటన: మంత్రి కామినేని


రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని మంత్రి అన్నారు. ఒకే ఘాట్ కు ఎక్కువమంది రావడంవల్లే తొక్కిసలాట జరిగిందని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News