: టి.బీజేపీ ఎమ్మెల్యేకి టీటీడీ సలహా మండలి ఛైర్మన్ పదవి
తెలంగాణ బీజేపీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పదవి విషయంలో అనుకున్నది సాధించుకున్నారు. అయితే బోర్డులో సభ్యుడిగా గాకుండా మరో రకంగా టీటీడీలో పదవి దక్కించుకున్నారు. హైదరాబాద్ లోని టీటీడీ కేంద్ర సలహా మండలి ఛైర్మన్ గా ఆయనను నియమిస్తూ ఈవో సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. గతంలో టీటీడీ బోర్డులో సభ్యుడిగా తెలంగాణ నుంచి చింతలకు అవకాశం ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో స్వతహాగా భక్తుడైన ఎమ్మెల్యే ఆనంద పారవశ్యమయ్యారు. అటు పార్టీ కార్యకర్తలు, అనుచరులు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పారు. కానీ చివరిలో టీటీడీ బోర్డు సభ్యుల జాబితాలో పేరు లేకపోవడంతో చింతల తీవ్ర నిరాశకులోనై అలకబూనారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఈ పదవితో ఆయనను సంతృప్తి పరిచిందని సమాచారం.