: శ్రీకుమరన్ ‘పసిడి’ చీర... ఖరీదు రూ.1.5 నుంచి 5 లక్షలట!
తమిళనాడు రాజధాని చెన్నైలో నిన్న జరిగిన ఫ్యాషన్ షోలో మిస్ ఇండియా రోషెల్ రావు ధరించిన చీర బంగారు వర్ణంలో తళతళా మెరిసిపోయింది. బంగారు వర్ణంలో మెరవడమేంటి, అనుకుంటున్నారా... అవును మరి, బంగారం, సిల్క్ మేళవింపుతో ‘తంగపట్టు’ పేరిట రూపొందించిన ఈ చీర తయారీలో 72 గ్రాముల బంగారాన్ని వినియోగించారట. సదరు చీరను తయారు చేసేందుకు ‘శ్రీకుమరన్’ కళాకారులకు దాదాపు 14 రోజుల సమయం పట్టిందట. బంగారమంటే అమితాసక్తి కనబరిచే మహిళల కోసం తయారు చేసిన ఈ చీరలను చెన్నైతో పాటు పాండిచ్చేరి, బెంగళూరుల్లోని తమ షోరూంలలో వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్లు శ్రీకుమరన్ ప్రకటించింది. ఖరీదెంతో చెప్పలేదు కదా, ఈ తంగపట్టు చీర ఒక్కోటి రూ.1.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య లభ్యమవుతుంది!