: గ్రీస్ కు ఊరట... మరోసారి సాయం చేయాలని యూరోజోన్ ఏకగ్రీవ నిర్ణయం!


తీవ్ర రుణభారంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలగా, యూరోపియన్ సమాజం ముందు బేలగా నిల్చున్న గ్రీస్ కు ఊరట లభించింది. గ్రీస్ కు మరోసారి ఆర్థిక సాయం అందించేందుకు యూరోజోన్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జరిగిన యూరోజోన్ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రీస్ కు మూడోవిడత బెయిలౌట్ రుణం ఇచ్చేందుకు యూరోజోన్ అంగీకరించిందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ తెలిపారు. అయితే, కొత్త సాయం నేపథ్యంలో గ్రీస్ కఠిన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుంది. తనవంతుగా, చిత్తశుద్ధితో ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. రుణదాతల షరతులకు గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ పూర్తిగా తలొగ్గినట్టు అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News