: ప్యారిస్ ఘటనలో బందీలు క్షేమం... పరారైన దుండగులు
ఫ్రాన్స్ మరోసారి వణికిపోయింది. పారిస్ లో కొందరు దుండగులు ప్రిమార్క్ వస్త్ర దుకాణంలో ప్రవేశించి 18 మందిని బందీలుగా పట్టుకోవడంతో ఫ్రాన్స్ తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆ దుకాణం వెలుపల భారీగా బలగాలను మోహరించి, చివరికి బందీలను క్షేమంగా వెలుపలికి తీసుకుని వచ్చారు. అయితే, దుండగులు పరారయ్యారు. వారు మరికొందరిని బందీలుగా పట్టుకున్నారేమో అని భావించిన పోలీసు అధికారులు లోపలికి వెళ్లి చూడగా, అక్కడెవరూ కనిపించలేదు. పరారీలో ఉన్న దుండగుల కోసం పెద్ద ఎత్తున వేట మొదలైంది. దుండగుల్లో ఆ వస్త్ర దుకాణం ఉద్యోగి ఒకరున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్ లో ఉగ్రవాద ఘటనలు తరచుగా చోటుచేసుకుంటుండడంతో ప్రజలు హడలిపోతున్నారు.