: సిరియా బాలికల కోసం స్కూలు ప్రారంభించిన మలాలా


పాకిస్థాన్ మారుమూల ప్రాంతాల్లో బాలికల విద్య కోసం పోరాడుతూ తాలిబాన్ల దాడికి గురైన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ 18వ జన్మదినోత్సవాన్ని తనదైన శైలిలో జరుపుకుంది. పుట్టినరోజు సందర్భంగా ఆమె లెబనాన్-సిరియా సరిహద్దు ప్రాంతంలో బాలికల కోసం ఓ పాఠశాలను ప్రారంభించింది. లెబనాన్ బెకా లోయలో ఉన్న శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న 200 మందికి పైగా సిరియా బాలికల విద్య కోసం ఈ పాఠశాల ఏర్పాటు చేశారు. 'ద మలాలా యూసఫ్ జాయ్ ఆల్ గాళ్స్ స్కూల్' పేరిట నెలకొల్పిన ఈ పాఠశాలలో విద్యతో పాటు వివిధరకాల చేతివృత్తుల్లో శిక్షణనిస్తారు. 14 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలకు ఈ స్కూల్లో ప్రవేశం ఉంటుంది. సిరియాకు చెందిన ధైర్యశీలురు, స్ఫూర్తిప్రదాతలైన బాలికలతో 18వ జన్మదినోత్సవం జరుపుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మలాలా ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం ఆమె తన తండ్రితో కలిసి లెబనాన్ ప్రధాని తమ్మమ్ సలామ్ ను కలిసింది.

  • Loading...

More Telugu News