: విజయవాడలో ఇఫ్తార్ విందు, మరుసటి రోజు రాజమండ్రిలో పుష్కరస్నానం... జగన్ బిజీబిజీ


రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. జగన్ వస్తుండడంతో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించాలని విజయవాడ నేతలు భావిస్తున్నారు. జగన్ ఆ మరుసటి రోజు (బుధవారం) పుష్కరాలకు వెళతారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన పవిత్ర పుష్కరస్నానం ఆచరిస్తారు.

  • Loading...

More Telugu News