: అక్కడ రాహుల్ ను అడ్డుకుంటే హైదరాబాదులో చంద్రబాబును అడ్టుకుంటాం: వీహెచ్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో టీడీపీ నేతల వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పందించారు. కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యలపై బదులివ్వాలని, వారి కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేదని, అలాంటప్పుడు రాహుల్ ఎలా జిల్లాలో పర్యటిస్తారని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వీహెచ్... టీడీపీ నేతలు రాహుల్ పర్యటనపై రాద్ధాంతం చేయడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ ఏపీ టీడీపీ నేతలు అనంతపురం జిల్లాలో రాహుల్ ను అడ్డుకుంటే, తాము హైదరాబాదులో చంద్రబాబును అడ్డుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News