: చదువుకోండ్రా అని పంపిస్తే... గంజాయి తాగుతూ పోలీసులకు దొరికిపోయారు


వారి తల్లిదండ్రులు వాళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాగా చదువుకుని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశించారు. కానీ, వారి ఆశలను అడియాశలు చేశారు వారి సుపుత్రులు. చదువుకోకపోగా చెడు దారి పట్టారు. ఈ ఉదయం హైదరాబాదులోని కాప్రా చెరువు వద్ద గంజాయి తాగుతూ ఇద్దరు బీటెక్ విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని విచారిస్తున్నారు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన విద్యార్థులు... ఇలా పెడదారి పట్టడం విచారించదగ్గ అంశమే.

  • Loading...

More Telugu News