: జింబాబ్వే టూర్ నుంచి వైదొలగిన రాయుడు... కేరళ కుర్రాడికి చోటు
జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా తెలుగుతేజం అంబటి రాయుడు తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో, అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి 'అన్ ఫిట్' అని తేల్చారు. రాయుడికి 2 నుంచి 3 వారాల పాటు విశ్రాంతి అవసరమని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జింబాబ్వేతో టీమిండియా మరో వన్డే మ్యాచ్, రెండు టి20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. దీంతో, రాయుడి స్థానంలో కేరళ యువకెరటం సంజూ శాంసన్ ను ఎంపిక చేశారు. టూర్ నుంచి రాయుడు వైదొలగిన నేపథ్యంలో సమావేశమైన బోర్డు సీనియర్ సెలక్షన్ కమిటీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ శాంసన్ కు అవకాశమివ్వాలని నిర్ణయించింది. రాయుడు జింబాబ్వేతో తొలి వన్డేలో 124*, రెండో వన్డేలో 41 పరుగులు చేసి సత్తా చాటాడు.