: పారిశుద్ధ్య కార్మికులపై టీ.ప్రభుత్వం సీరియస్... సాయంత్రంలోగా విధుల్లో చేరాలని అల్టిమేటం


గత ఎనిమిది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. సమస్య పరిష్కరించాలని తామనుకుంటున్నా, కార్మికులు సమ్మె కొనసాగించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం గోదావరి పుష్కరాలు, త్వరలో రంజాన్, బోనాల పండగలు రాబోతున్న సమయంలో ఔట్ సోర్సింగ్ కార్మికులు ఇలా సమ్మె చేయడం సరికాదని ప్రభుత్వం సూచించింది. సమ్మె విరమించి సాయంత్రంలోగా విధుల్లో చేరాలని కార్మికులను కోరింది. లేకపోతే రేపటి నుంచి ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆర్మీ, పోలీసులు, ఇతర ఉద్యోగుల సహకారంతో పారిశుద్ధ్య పనులను చేయించాలని నిర్ణయించామని ప్రభుత్వం వెల్లడించింది. జీహెచ్ఎంసీ ఉద్యోగులు కానప్పటికీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని, సమ్మె విరమించి విధుల్లో చేరితే డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచుతామని గతంలో సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేసింది. ఈ రోజు సమ్మె విరమించకపోతే కొత్త వారిని నియమిస్తామని అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనకు కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తాయో తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News