: ఏపీ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన మాగుంట, శిల్పా


ఏపీ శాసనమండలిలో అధికార టీడీపీ బలం మరింత పెరిగింది. ‘స్ధానిక’ కోటాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మాగుంట శ్రీనివాసులురెడ్డి(ప్రకాశం జిల్లా), శిల్పా చక్రపాణిరెడ్డి (కర్నూలు జిల్లా)లు కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి వారిద్దరి చేత ప్రమాణం చేయించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో మాగుంట, కర్నూలు జిల్లా శ్రీశైలం అసెంబ్లీ స్థానంలో శిల్పా పరాజయం పాలయ్యారు. అయితే వారిద్దిరి ప్రాధాన్యాన్ని గుర్తించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ టికెట్లిచ్చారు.

  • Loading...

More Telugu News