: గ్రేటర్ హైదరాబాద్ మనదే: దత్తాత్రేయతో చంద్రబాబు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ తనతో కలసినప్పుడు చంద్రబాబు ఈ మేరకు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసినట్టు సమాచారం. భేటీ సందర్భంగా, గ్రేటర్ ఎన్నికలు, వరంగల్ ఉపఎన్నికపై వీరు చర్చించారు. 'క్షేత్ర స్థాయిలో రెండు పార్టీలు కలసికట్టుగా పనిచేయగలిగితే విజయం మనదే' అని చంద్రబాబు చెప్పారట. బాబు వ్యాఖ్యలతో దత్తాత్రేయ కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.