: పుష్కర యాత్రికులకు ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలే: మంత్రి శిద్దా


రేపటి నుంచి ప్రారంభంకానున్న గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు వసూలు లేదని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. అదనపు ఛార్జీ వసూలు చేయాలన్న ప్రతిపాదనలు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. దాంతో పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం ఉండదని చెప్పారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సాంబశివరావును కూడా ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

  • Loading...

More Telugu News