: 'వ్యాపం' గుట్టు విప్పేందుకు రంగంలోకి సీబీఐ...40 మంది అధికారులతో ముమ్మర దర్యాప్తు


మధ్యప్రదేశ్ లో వెలుగుచూసిన 'వ్యాపం' కుంభకోణంలో వరుస అనుమానాస్పద మరణాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పిటీషన్ తో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తును పరిశీలించిన సీబీఐ నేడు ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగుతోంది. నిజాలను నిగ్గుతేల్చడంలో ఆరితేరిన దాదాపు 40 మంది అధికారులను సీబీఐ రంగంలోకి దింపనుంది. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో వీరంతా మరికాసేపట్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చేరుకోనున్నారు. కేసు ప్రాధాన్యం నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టనున్న అధికారుల పేర్లను కాని, జేడీ స్థాయి అధికారి పేరును కాని సీబీఐ బయటకు వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News